FbTelugu

నుజ్జునుజ్జయిన ఆటో… ముగ్గురు మృతి

గుంటూరు: సత్తెనపల్లి ఐదులాంతర్ల సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలలో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొన్నది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు.

గుంటూరు నుంచి ధూళ్లిపాళ్ళ కళ్ళేం స్పిన్నింగ్ మిల్లుకు వెళ్తుoడగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఆటో నుజ్జు నుజ్జు అయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఉత్తరప్రదేశ్ చెందిన ముగ్గురు కూలీలు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.