FbTelugu

మద్యం మత్తులో భార్యపై దారుణం

గుంటూరు: సత్తెనపల్లి ఎన్ఎస్పీ అతిధి గృహం వద్ద దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న భర్త వేటకొడవలితో భార్య మెడ నరకడంతో అక్కడికక్కడే చనిపోయింది.
తల మొండెంను వేరు చేసి కిరాతకంగా హత్యచేశాడు. ఆ తరువాత తలను తీసుకుని పోలీసులకు లోంగిపోయాడు. మంగళవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో భార్యభర్తల మద్య గొడవ జరిగింది. గొడవపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భార్య బయలుదేరింది.
అయితే ఈ విషయం తెలుసుకున్న భర్త శ్రీనివాసరావు (46) ఎన్ఎస్పీ గెస్టు హౌస్ వద్ద అడ్డుకున్నాడు. వినకపోవడంతో ఆమెను అడ్డగించి వేటకొడవలితో హత్య చేశాడు. నిందితుడు ఎన్ఎస్పీ కెనాల్స్ లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

You might also like