FbTelugu

ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్, బాలుడు మృతి

జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇవాళ స్థానిక అనంతనాగ్ జిల్లాలో భారత బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడ జరిగిన ఎదరు కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్, మరో బాలుడు మృతిచెందాడు. ముగ్గురు జవాన్లకు, మరికొంతమంది స్థానికులకు తీవ్ర గాయాలైనాయి.

కాగా బిజ్ బెహ్రా లో కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులపై భారత బలగాలు తీవ్రంగా విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే.

You might also like