FbTelugu

వైన్ షాపుల ముందు జనం బారులు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పోలింగ్ బూతులు ఇవాళ సాయంత్రం వరకు మందకొడిగా, మరికొన్ని కేంద్రాలు వెలవెలబోగా, పోలింగ్ ముగిసిందో లేదా జనం వైన్ షాపుల ముందు క్యూ కట్టారు.

ఇవాళ సాయంత్రం జనం తాకిడితో వైన్ షాపులు కళకళలాడాయి. ఓట్లు వేసేందుకు ముందుకు రాని జనం మందు కోసం క్యూ కట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ షేర్ అవుతున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 45 కాగా, ఈసారి పోలింగ్ శాతం 40కి మించకపోవచ్చని అంటున్నారు. ప్రభుత్వం సెలవు ప్రకటించినా ఓటు వేసేందుకు మెజారిటీ ఓటర్లు ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పలువురు యూత్ పోలింగ్ బూత్ కు మొహం చూపకుండా చాటేశారు. అలాంటి వారు వైన్ షాపులు తెరవగానే బారులు తీరడం ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.