FbTelugu

మావోయిస్టు నేతల తలలపై రూ. కోటి రివార్డు

రాయపూర్: మావోయిస్టు అగ్రనేతల తలలపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కోటి రూపాయల భారీ రివార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా 34 మంది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల లిస్ట్ ను ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు.

నలుగురు అగ్రనేతల తలలపై రూ.కోటి రివార్డు ప్రకటించింది. మరో 9 మంది నేతలపై 40 లక్షల రివార్డు ప్రకటించింది. ఆ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నంబాల కేశవరావు, ముప్పాళ్ల లక్ష్మణరావు, కటకం సుదర్శన్, మల్లోజుల వేణుగోపాల్ పై కోటి రివార్డు ప్రకటించారు. ఈ నెల 18న నంబాల కేశవరావు అధ్యక్షతన మావోయిస్టులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకు 10 వేలకు పైగా హాజరైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.