FbTelugu

నీ పంట… నా ఇష్టం పై 21న మీటింగ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు ఈ నెల 21న మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది.

మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆ సమావేశానికి ఆహ్వానించారు. వారితో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా చర్చించి జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటల సాగుపై చర్చిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి? అనే విషయాలను ఖరారు చేసేందుకు మంగళ, బుధవారాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు సమావేశాలు జరుపుతున్నారు.

ఈ సమావేశం అనంతరం జిల్లాల వారీగా పంటల మ్యాప్ ను రూపొందిస్తారు. ఆ పంటల మ్యాప్ పై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి, ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయిస్తారు.

You might also like