FbTelugu

బతకడానికి మందులు లేవు… చస్తే స్మశానంలో స్థలం లేదు

వరంగల్ లో ఎంపి ఏ.రేవంత్ రెడ్డి విమర్శ

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలనలో దుస్థితి ఎలా ఉందంటే బతుకుదామంటే ఆసుపత్రులలో మందులు, ఆక్సిజన్ లేదని… చస్తే స్మశాన వాటిలో చోటు దొరకడం లేదని కాంగ్రెస్ ఎంపి ఏ.రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇవాళ వరంగల్ నగరంలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా నిర్వహించిన రోడ్డు షో లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. వరంగల్ నగరాన్ని మురికి నగరంగా మార్చారని, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో గత గ్రేటర్ మున్సిపల్ పాలక మండలి తీవ్ర నిర్లక్ష్యం పాటించిందన్నారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ పాలిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కరోనా తరువాత ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలారని, ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ లో మంచం దొరకడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు రాకపోవడంతో ఖాళీగా ఉంటున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుందని, టిఆర్ఎస్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత టిఆర్ఎస్ ఏజెంట్లుగా మారిన అధికారుల లాగుల్లో తొండలు వేసి కొడతా జాగ్రత్త బిడ్డా అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.