FbTelugu

హాస్పిటల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు

విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసింది. రమేష్ హాస్పిటల్స్ స్వర్ణ ప్యాలెస్ ను లీజుకు తీసుకొని కోవిడ్ సెంటర్ గా వాడుతోంది.

కాగా ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి అందులోని కోవిడ్ పేషెంట్లు ఇప్పటివరకు సుమారు 13 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా మరికొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. రమేష్ హాస్పిటల్, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాలపై పోలీసులు సెక్షన్ 304, 308 కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

You might also like