FbTelugu

మాంసం కోసం బర్రె తొడలు కోశారు!

సిద్దిపేట: రాత్రిపూట పార్టీ చేసుకునేందుకు ప్రాణంతో ఉన్న బర్రె తొడలను కోసి నిర్ధాక్షిణ్యంగా చంపేశారు. ఈ ఘటన కొండపాక మండలం సిరిసిన గుండ్ల గ్రామ శివారులో జరిగింది.

గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసినగండ్ల-దమ్మకపల్లి గ్రామాల మధ్య రాజేందర్ రెడ్డికి వ్యవసాయ భూమి ఉంది. బర్రెలను సాకేందుకు కొంత మంది పనివాళ్లను నియమించుకున్నారు. ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాళ్లు కాగా మరొకరు నేపాల్ దేశానికి చెందిన యువకుడు ఉన్నాడు. శుక్రవారం రాత్రి రాజగిరి వెంకటేశం అనే రైతు పాకలో ఉన్న బర్రెల నుంచి పాలు పితికి ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి నలుగురు యువకులు కలిసి మాంసం కోసం రెండు బర్రెల తొడ భాగాలను కోసేశారు. తీవ్ర రక్తస్రావంతో అవి తెల్లారేసరికి చనిపోయాయి. శనివారం ఉదయం పొలానికి వెళ్లిన వెంకటేశం బర్రెలను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. గ్రామస్థులతో కలిసి రాజేందర్ రెడ్డి భూమిలో గాలించగా, వారిలో ముగ్గురు ఏపికి చెందిన వారు పరారీ అయ్యారు. నేపాలీ యువకుడు సందీప్ (25) పట్టుబడ్డాడు. నిలదీయడంతో రెండు బర్రెల తొడలను కోసింది తామేనని నిజాన్ని చెప్పాడు. గ్రామస్థులు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సందీప్ ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురి నిందితుల కోసం గాలిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.