FbTelugu

యువతిని లొంగదీసుకుని డబ్బులు ఎగవేశాడు!

హైదరాబాద్: తన కంపెనీలో పనిచేసేందుకు ఉద్యోగం కోసం వచ్చిన యువతికి ఇంటర్వ్యూలో ఎంపిక చేసి ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చాడు కదా అని అతని మాటలు నమ్మి ప్రేమించింది. తన వద్ద ఉన్న రూ.37 లక్షలు అప్పు ఇచ్చి నిండా మోసపోయింది.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాసాపేట ఆంజనేయ నగర్ లో ఒడిశా కు చెందన జాయ్ (32) విప్రో సంస్థలో టీమ్ లీడర్ గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో ఉద్యోగం కోసం అల్వాల్ కు చెందిన ప్రీతి (28) వెళ్లింది. జాయ్ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశాడు. తనకు ఉద్యోగం ఇచ్చాడనే గౌరవంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి శారీరకంగా కలిశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతని ఇంటికి తరచూ వెళ్లేది.
వ్యాపారం చేస్తానని చెప్పడంతో తన వద్ద ఉన్న రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఇంకా అవసరం ఉందని చెప్పడంతో మరో రూ.27 లక్షలు అప్పు చేసి ముట్టచెప్పింది. బ్యాంకులకు వాయిదాల ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉంది. వాయిదాలకు డబ్బులు ఇవ్వాలని అడగడంతో దూరం పెడుతూ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీ అయ్యాడు. తను శారీరకంగా, ఆర్థికంగా మోసపోయానని గ్రహించిన ప్రీతి కూకటపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

అతని కోసం గాలించగా మహారాష్ట్ర నాసిక్ లో పట్టుబడ్డాడు. అక్కడి నుంచి తీసుకువచ్చి పోలీసులు విచారించగా నిజం చెప్పాడు. ఇప్పటికే తనకు భార్య ఉందని, భార్య ఊరు వెళ్లిన సమయంలో ప్రీతిని పిలిపించుకునేవాడినని చెప్పాడు. ఆర్థికంగా నష్టపోవడంతో ఆమె నుంచి డబ్బులు తీసుకున్నానని చెప్పాడు. అతని బ్యాంకు అక్కౌంట్లలో ఉన్న రూ32 లక్షల నగదు సీజ్ చేసి రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.