FbTelugu

కుక్కను తిడతారా అంటూ చితక్కొట్టారు

గుర్గాంవ్: పెంపుడు జంతువులపై ప్రేమ ఉండవచ్చు కాని మితిమీరి ఉండవద్దు. వాటిని మందలిస్తే యజమానులకు కోపం వచ్చిన ఘటనలు చూశాం కాని దాడి చేసింది ఎక్కడా చూడలేదు.

గుర్గాంవ్ సైబర్ సిటీలో ఒక పెంపుడు కుక్క ఇంటి ముందు తిరుగుతూ వచ్చిపోయేవారిని భయాందోళనకు గురి చేస్తున్నది. కుక్కను ఇంట్లో కట్టేసుకోవాలని, తమ పిల్లలను భయపెడుతున్నదని ఎదురింట్లో ఉంటున్న సుధీర్ సూచించాడు. కుక్కను పేరు పెట్టి పిలవకుండా కుక్క అంటావా అంటూ యజమాని సుధీర్ పై మండిపడ్డాడు. అంతటితో ఆగకుండా కుటుంబ సభ్యులందరూ మూకుమ్మడిగా సుధీర్ ఇంటికి వెళ్లి ఆరుగురిని చితకబాదారు. ఈ దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలుకావడంతో వారు వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తరువాత వారిని ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి పంపించి కేసు విచారిస్తున్నారు. కుక్క తమ పిల్లలను ప్రతిరోజు వెంబడించడంతో ఇంట్లో కట్టుకోవాలని సూచించానని, దానికి కోపగించి తన కుటుంబంపై దాడికి దిగారని సుధీర్ తెలిపాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.