FbTelugu

వన్ సైడ్ లవ్… నిరాకరణతో కాల్పులు

లక్నో: ఒక వైపు ప్రేమలు (వన్ సైడ్ లవ్) యువతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రేమను తిరస్కరిస్తున్న యువతులు, మహిళలపై దాడులు జరుగుతునే ఉన్నాయి.
తనతో కలిసి ఇంటర్ వరకు చదివిన ఒక యువతి తనతో మాట్లాడేందుకు నిరాకరించడంతో బైక్ పై ఆమెను వెంటాడి ఛాతిపై కాల్చాడు. ఆ తరువాత తనపై కాల్చుకుని ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటన జన్పూర్ లో చోటు చేసుకున్నది. నీతు యాదవ్ (22) స్కూలు టీచర్ గా పనిచేస్తున్నది. సుల్తాన్ పూర్ కు చెందిన అంకుర్ యాదవ్ నీతూ ను కొద్ది రోజులుగా వెంటపడ్డాడు. ఆమెతో మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించడంతో నిరాకరించింది. ఈ అవమానం భరించలేని అంకుర్ యాదవ్ ఆమె వెంటపడి కాల్పులు జరిపాడు. ఆ వెంటనే తనపై కాల్పులు జరుపుకుని రోడ్డు మీదే పడిపోయాడు. ప్రత్యక్ష సాక్షులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలం చేరుకుని బాధితురాలిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వన్ సైడ్ లవ్ ఫెయిల్ కావడంతో విసిగు చెంది కాల్పలుకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.