FbTelugu

వివాహితను తిడుతూ.. కొడుతూ నడిపించారు…

భోపాల్: భర్త వేధింపులు భరించలేక విడిపోయి, వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్నా భర్త తరఫు బంధువులు క్షమించలేదు సరి కాదా శిక్షించారు. వేరే వ్యక్తితో ఉండడాన్ని జీర్ణించుకోలేని భర్త తరఫు బంధువులు, గ్రామస్తులు ఆమెను నిందించారు.

అంతటితో ఆగారా అంటే లేదు. భర్త బంధువును తన భుజాలపై ఎక్కించుకుని మూడు కిలోమీటర్ల దూరం వరకు పరిగెత్తించారు. ఆయసం వచ్చి ఆగినప్పుడల్లా కర్రలతో కొట్టి నానా రకాలుగా దూషించారు. ఈ ఘటన గునా జిల్లాలో చోటు చేసుకున్నది. ఇంతగా చదువుకున్న జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈమె నడుస్తున్నప్పుడు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగి బాధ్యులైన నలుగురిని అరెస్టు చేశారు. మరికొందరు గ్రామం నుంచి పారిపోయారు. బాధ్యులైన వారిని జైలుకు పంపిస్తామని పోలీసులు ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.