FbTelugu

ఐటి రిటర్నులకు క్రెడిట్ కార్డు సదుపాయం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో మరింత సులువుగా ఐటి రిటర్నులు దాఖలు చేసేందుకు ఇన్ కమ్ టాక్స్ వైబ్ ఫోర్టల్ ను ఆధునీకరించింది. పన్ను చెల్లింపుదారుల కోసం అనేక సదుపాయాలను తీసుకురానున్నది.

పన్నులు, ఫీజులు, జరిమానాలు సహా అనేక సేవలను అందిచేందుకు ప్రైవేటు బ్యాంకులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటి వరకు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు ద్వారా మాత్రమే చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. ప్రైవేటు బ్యాంకులకు ఫోర్టల్ లో చోటు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతాయని గమనించారు. చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డు తో పాటు యుపిఐ చెల్లింపులను కల్పించనున్నారు. మరో వారం రోజుల్లో కొత్త సౌకర్యాలు వినియోగంలోకి రానున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.