FbTelugu

విమానంలో పాగల్ గాడి పరేషాన్

న్యూఢిల్లీ: ఎవరైనా విమానం నడుస్తున్న సమయంలో కిటికీలు తెరిచి దూకాలని ప్రయత్నిస్తారా?. అది ఊహించుకోవడానికి గగుర్పాటు కలిగిస్తుంది. విమానంలో ఎక్కే వరకు మాత్రమే మన బాధ్యత. దింపే వరకు సీట్లోనే కూర్చోవాలి.
కాని దీనికి భిన్నంగా ఒక ప్రయాణీకుడు పిచ్చోడి మాదిరి ప్రవర్తించి అటు ప్రయాణీకులు ఇటు విమానా సిబ్బందిని హడలెత్తించాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 27వ తేదీన స్పైస్ జె విమానం ఎస్జీ 2003 ఢిల్లీ నుంచి వారణాసికి బయలుదేరింది.

అందులో ప్రయాణిస్తున్న గౌరవ్ అనే వ్యక్తి సీట్లోనుంచి కదిలి ఎమర్జెన్సీ డోర్ వద్దకు వెళ్లాడు. డోర్ ను తెరిచేందుకు ప్రయత్నం మొదలు పెట్టగా విమాన సిబ్బంది, తోటి ప్రయాణీకులు అడ్డుకున్నారు. వారించినప్పటికీ వినకుండా గొడవకు దిగాడు. అందరూ కలిసి అతన్ని గట్టిగా పట్టుకుని నియంత్రించారు. ఈ సమాచారాన్ని పైలెట్ కు చేరవేయడంతో ఏమాత్రం ఆలోచించకుండా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
ప్రయాణీకుల భద్రత కోసం వెంటనే ఏటీసీకి సమాచారం చేరవేసి, వారి అనుమతితో వారణాసిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఈలోపు సిఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు విమానం వద్దకు చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అప్పగించిన తరువాత విమాన సిబ్బంది, ప్రయాణీకులు ఊపరిపిల్చుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.