FbTelugu

సంక్రాంతికి ముందుగానే ‘క్రాక్’ విడుదల

రవితేజ కథానాయకునిగా.. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందిన ‘‘క్రాక్’’ మూవీ ఈ సంక్రాంతి పండుగకు కాస్త ముందుగానే విడుదల కానుంది. గతేడాది కరోనా కారణంగా మొత్తం సినిమా రంగమే పూర్తిగా కుదేలైంది.

కరోనా అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇప్పుడిప్పుడే సినిమారంగం పట్టాలెక్కుతోంది. ప్రతిఏటా సంక్రాంతికి అనేక సినిమాలు సందడి చేసేవి కానీ ఈ సారి ఆ కళలేదనే చెప్పవచ్చు. కాగా ఈ నెల 09 న క్రాక్ విడుదల చేస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.