FbTelugu

టిఆర్ఎస్ తో అంటకాగడం లేదు: సిపిఐ

హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎన్నో పోరాటాలు చేస్తున్న సిపిఐ పార్టీ, సిఎం కెసిఆర్ మార్గనిర్ధేశనంలో పనిచేస్తుందని మాజీ మంత్రి మంత్రి ఈటల రాజేందర్ చెప్పడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శ చాడ వెంకట్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖలు నిరాధారమైనవని ఆయన ఖండించారు. అసైన్డు, దేవాలయ భూములు ఎవరు కొనుగోలు చేసినా తప్పేనని, వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అసైన్డు భూములను పరిరక్షించాలని లేకపోతే మళ్లీ భూ పోరాటాలు, వీధి పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. భూముల డిజిటల్ సర్వే పై సిఎం కెసిఆర్ అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని చాడ వెంకట్ రెడ్డి కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.