FbTelugu

రాజధానిపై బీజేపీ వైఖరేంటీ ?: సీపీఐ రామకృష్ణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అన్న అంశంలో బీజేపీ తన వైఖరేంటో స్పష్టంగా చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బీజేపీ నేతలను డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉన్నపుడు అమరావతికి సై అన్న బీజేపీ.. ఇప్పుడు జగన్ కు వత్తాసు పలకడమేంటని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమరావతి రాజధానిగా కావాలంటూ వివాదాలు తీవ్రమౌతున్న తరుణంలో బీజేపీ ఇప్పటికైనా తన వైఖరేంటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

You might also like