FbTelugu

ఆ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై భారం: సీపీఐ రామకృష్ణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తిరస్కరించాలని కోరారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ బిల్లులను తెచ్చారని ఆరోపించారు. ఈ నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ది కుంటుపడుతుందని ఆరోపించారు.

You might also like