FbTelugu

రుయా లెక్క 11 కాదు 23: సిపిఐ కార్యదర్శి నారాయణ

తిరుపతి: రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి సంఖ్య విషయంలో ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు.
ఆక్సిజన్ అందక కేవలం 11 మంది మాత్రమే మృతి చెందారు అని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ప్రకటన నిజాలను కప్పి పుచ్చేలా ఉందని విమర్శించారు. ఆ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందారన్నారు. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉంటే ఎందుకు ప్రభుత్వం అబద్దాలు ఆడాలని నిలదీశారు. రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ అందించమని కేంద్రంలోని మోదీ సర్కారును నిలదేయలేక రాష్ట్ర ప్రజల ప్రాణాలు బలిపెట్టడాన్ని ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. మోదీ బ్లాక్ మెయిల్ పద్దతిని తలచుకొని వణుకు పుడుతోందా అని ప్రశ్నించారు. ఈ రోజు రాత్రి రుయా హాస్పిటల్ లో చనిపోయినవారి పేర్లతో సహా వివరాలు మీడియాకు విడుదల చేస్తున్నట్టు నారాయణ తెలిపారు.

మృతుల వివరాలు…
1. కె బాలు, తిరుపతి
2. జయచంద్ర, తిరుపతి
3. పి.ఎస్.రామారావు, చంద్రగిరి
4. రమేష్ బాబు, చెన్నారెడ్డి కాలనీ తిరుపతి
5. జి.భువనేశ్వరి బాబు, చిత్తూరు.
6. కలందర్, కుక్కలదొడ్డి
7. కె.రమణ ఆచారి, పీలేరు
8. ఎన్.ప్రభాకర్
9. ఎస్.మహేంద్ర
10. ఎస్.షాహిద్
11. గజేంద్ర బాబు, పుంగనూరు
12. పుష్పలత,కలికిరి
13. మహమ్మద్ బాషా, మదనపల్లి
14. వేణుగోపాల్, సదుం
15. గౌస్ బాషా, పుంగనూరు
16. రాజమ్మ, మేధంవాలపల్లి
17. మాదన్ మోహన్ రెడ్డి, కందురు
18. దేవేంద్ర రెడ్డి, ఎర్రవారి పాలెం
19. సుబ్రమణ్యం
20. బి.సులోచన, కలకడ
21. తనుజ రాణి, రేణిగుంట
22. పజులాల్, దామలచెరువు
23. వెంకట సుబ్బయ్య, రాజంపేట.

You might also like

Leave A Reply

Your email address will not be published.