FbTelugu

పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టాలి: జస్టిస్ రమణకు వినతి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టి, తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను సిపిఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవాళ రాజ్ భవన్ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినందున వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపుల కేసులు, రాజ్యాంగ ఉల్లంఘనల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. దేశంలో లౌకిక వ్యవస్థను కాపాడాలని, దశాబ్దాల తరబడి విచారణకు రాకుండా ఉన్న పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. న్యాయవ్యవస్థలో ప్రగతిశీల సంస్కరణలను ప్రవేశపెట్టి, న్యాయ వ్యవస్థ ప్రతిష్టను పెంచడం పట్ల అభినందనలు తెలియజేశారు.

న్యాయయవస్థలో ఉన్న లోపాలకు నేనూ బాదితుడనే అని, తన పాస్ పోర్టు పెండింగ్ లో పెట్టిన విషయం నారాయణ జస్టిస్ రమణకు వివరించారు. న్యాయ వ్యవస్థ సరళీకరణ కాకపోతే నాలాంటి పౌరులకు న్యాయం సకాలంలో జరగదన్నారు. సాంకేతిక లోపాలతో పాస్ పొర్టు తిరస్కరించబడితే ఆరునెలలుగా ఇబ్బందులు పడుతున్నాను. అమెరికాలో ఉన్న మా అమ్మాయి ప్రసవానికి కూడా వెళ్ళలేకపోయానన్నారు. ఆర్దికనేరస్తులందరికి పాస్ పోర్టులు మంజూరవుతాయి? పునరుద్దరించాబడతాయి? నాలాంటి వాళ్ళ పాస్ పోర్టులకు మాత్రం ఆటంకాలు ఏర్పడతున్నాయని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.