* బండి సంజయ్ వ్యాఖ్యలపై సీపీ సజ్జనార్ ఫైర్
హైదరాబాద్: బాధ్యతగల వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల నిర్వహణ పట్ల ఇవాళ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. పోలీసులపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 13,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో 2,437 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్టు తెలిపారు. వాటిలో 766 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు తెలిపారు. 177 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నట్టు తెలిపారు.