FbTelugu

గొర్రెలకుంటలో సీపీ రవీందర్ పర్యటన

వరంగల్: గొర్రెల కుంటలో ఘటనా స్థలాన్ని సీపీ రవీందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బావిలో ఇప్పటివరకు మొత్తం ఏడు మృతదేహాలు లభించడంతో వారి మృతికి సంబంధించి అక్కడ క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోందని తెలిపారు.

ప్రాథమికంగా బీహార్ ముఠాపైనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకూ అక్కడ నివసిస్తున్న బీహార్ యువకుల ముఠా ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. వారికోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలు వస్తే అవి సామూహిక హత్యలా ? లేదా ఆత్మహత్యలా అనేది నిర్ధారణ అవుతుందని అన్నారు.

You might also like