FbTelugu

రూమర్స్ పై సీపీ అంజనీకుమార్ ఫైర్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ పై హైదరాబాద్ సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) అంజనీ కుమార్ ఫైర్ అయ్యారు. ప్రజలెవరూ.. సోషల్ మీడియా రూమర్స్ ను నమ్మవద్దని కోరారు.

ఎన్నికల ముసుగులో కొందరు కావాలనే మతఘర్షణలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. మత ఘర్షణలు సృష్టించాలని చూస్తే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదుచేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఘర్షణలు జరిగేట్టు పెడుతున్న పోస్టులపై నిఘా పెట్టినట్టు తెలిపారు. అల్లర్లు చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.