FbTelugu

ఇండియన్లను లూటీ చేస్తున్న ‘‘కోవిషీల్ట్’’

న్యూఢిల్లీ: ఇండియాలో తయారు చేస్తూ, తక్కువ ధరకే కోవిషీల్డ్ వ్యాక్సిన్లను సరఫరా చేయాల్సిన సిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇక్కడి పౌరులనే నిండా దోచేస్తున్నది. ఇటీవల కంపెనీ ప్రకటించిన ధరలు, విదేశాల్లో విక్రయిస్తున్న ధరలను గమనిస్తే చాలా వ్యత్యాసం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ.400 చొప్పున, ప్రైవేటు హాస్పిటళ్లకు అయితే రూ.600 చొప్పున విక్రయిస్తామని సిరం ఇనిస్టిట్యూట్ రెండు మూడు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది. ఎవరైనా ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుంటే రూ.600 (9 డాలర్ల వరకు) చెల్లించాలి. అయితే ఈ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ ధరలు ఏ దేశంలో కూడా లేవు. ఏ దేశాలు కూడా ఇంత ఎక్కువ ధరకు కొనుగోలు చేయకపోవడం గమనించాల్సిన అంశం. అమెరికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక డోసు కోసం కేవలం 4 డాలర్లు (రూ.300) చెల్లిస్తున్నది. బంగ్లదేశ్ కూడా ఇదే ధర చెల్లించడం విశేషం. బ్రిటన్ లో ఈ వ్యాక్సిన్ ధర 3 డాలర్లు (రూ.240) మాత్రమే. ఇతర దేశాలకు తక్కువ ధరకు విక్రయిస్తున్న సిరం ఇనిస్టిట్యూట్ ఇండియన్ల జేబులు గుల్ల చేస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.