FbTelugu

ఇక తెలుగులో కోవిన్ పోర్టల్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పోర్టల్లో ప్రాంతీయ భాషలు ప్రవేశపెట్టారు. తాజాగా కోవిన్ ఫోర్టల్ లో తెలుగు భాషను అందుబాటులోకి తెచ్చారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుండడంతో అందరికీ చేరువ అయ్యేందుకు ప్రాంతీయ భాషలను కూడా చేర్చారు.

ఇందులో తెలుగు సహా మరాఠీ, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, మలయాళం, కన్నడ, బెంగాళీ, ఒడియా భాషలు ఉన్నాయి. 18 సంవత్సరాలకు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ పోర్టల్ ద్వారా లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. పూర్తిస్థాయిలో హిందీ, ఇంగ్లీషు భాష రాని వారు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పోర్టల్ లో మొత్తం 14 ప్రాంతీయ భాషలను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుని అమలుపరిచారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.