FbTelugu

కరోనాకు ఇంజెక్షన్ వచ్చేసింది

హైదరాబాద్: కరోనా వైరస్ పై పోరాడేందుకు ఇప్పటికే మందు బిల్లలు రాగా తాజాగా ఇంజెక్షన్ కూడా వచ్చేసింది.

కోవిడ్ రోగం బారిన పడినవారు, అనుమానితులు ఉపయోగించుకుని  స్వస్థత పొందే విధంగా ఇంజెక్షన్ రూపొందించామని హెటిరో పార్మా ప్రకటించింది. కోవిఫర్ పేరుతో దీన్ని విడుదల చేస్తున్నట్లు ఫార్మా కంపెనీ ఛైర్మన్ డా. బి.పార్థసారధి రెడ్డి తెలిపారు. 100 మిల్లి గ్రముల వయల్ రూపంలో అందుబాటులోకి వస్తున్నదన్నారు. వయల్ ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కూడా పొందామన్నారు.

అయితే ఇప్పటికే ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నయం చేసేందుకు మందు బిల్లలు తయారు చేసి, విక్రయిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫవిపిరవిర్ ఫాబి ఫ్లూ పేరుతో ఈ మందు బిల్లలను శనివారం నాడు ఆవిష్కరించారు.

You might also like