FbTelugu

కొవిడ్ వ్యాక్సిన్ రూ.250 మాత్రమే

న్యూఢిల్లీ: సీరం ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఒక డోసును రూ.250కే అందిస్తామని కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపితే చౌక ధరకే లభ్యమయ్యే అవకాశాలున్నాయి.
గతంలో తమ వ్యాక్సిన్ ధర రూ.1000 వరకు ఉండవచ్చని సీరం ఇనిస్టిట్యూట్ ఆప్ ఇండియా సీఈఓ అధార్ పునావల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత్ లాంటి దేశాల్లో అంత మొత్తాన్ని వెచ్చించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. వీటిని పరిగణనలోకి తీసుకున్న సీరం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలను ఖరారు చేసిందని అంటున్నారు. వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వాలు భారీ ఒప్పందాలు చేసుకుంటున్న నేపథ్యంలో ధరలు మరింతగా తగ్గనున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఒక్క డోసు రూ.250కు ఇస్తామని వస్తున్న వార్తలపై సీరం మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. వ్యాక్సిన్ పంపిణీలో తొలి ప్రాధాన్యం భారత్ కే ఇస్తామని సీఈఓ పూనావల్ల ప్రకటించారు కూడా. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ విడుదల చేసేందుకు సీరం కంపెనీ అనుమతుల కోసం ఔషధ నియంత్రణ సంస్థ కు దరఖాస్తు చేసుకున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.