FbTelugu

కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ రూ.28 వేలు మాత్రమే

హైదరాబాద్: దేశంలో కరోనా వైద్యం అత్యంత ఖరీదైపోయింది. ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాయి. సాధారణ దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉండి కోవిడ్‌ పేషెంట్‌ అయితే చాలు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలను అందజేసేందుకు జైన్‌ ఇంటర్నేషనల్‌ స్వచ్చంద సంస్థ వంద పడకల ‘ కోవిడ్‌కేర్‌ సెంటర్‌’ ఏర్పాటు చేసింది. బాధితులను ఆదుకొనేందుకు ఈ సంస్థ దేశవ్యాప్తంగా 15  కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. తాజాగా 16వ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను సికింద్రాబాద్  బేగంపేట లోని మానస సరోవర్‌లో 100 పడకలతో, అన్ని రకాల సదుపాయాలతో అందుబాటులోకి  తెచ్చారు. ఐసిఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా, వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ ఆసుపత్రిలో కోవిడ్‌ బాధితులకు వైద్య సేవలు లభిస్తాయి. కేవలం నామమాత్రపు ఫీజులతో అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నట్లు జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి వినోద్‌ రాంకా తెలిపారు.

 

ఇవీ ప్రత్యేకతలు…

♦ బేగంపేట్‌ చిరాగ్‌ఫోర్ట్‌ లో ఉన్న మూడంతస్తుల మానస సరోవర్‌ హాటల్‌ను జైన్‌ ఇంటర్నేషనల్‌ ప్రస్తుతం కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ గా మార్చారు.

♦ మొదటి, రెండో అంతస్తులలో 100 పడకలు ఏర్పాటు.

♦ కోవిడ్‌ పాజిటివ్ నిర్ధారణ అయిన వారు చేరవచ్చు.

♦ ఒక గదిలో ఇద్దరు చొప్పున ఉంటే వారం రోజులకు ఒక్కొక్కరు రూ.28,000 చొప్పున చెల్లించాలి.

♦ఒక్కరే సింగిల్‌ రూమ్‌లో ఉంటే వారం రోజులకు రూ.35,000 ఫీజు.

♦ ఈ ఫీజులోనే కోవిడ్‌ నివారణకు అవసరమయ్యే మందులు, చికిత్స, ఆక్సిజన్‌ (అవరమైన వారికి) తదితర అన్ని సదుపాయాలు లభిస్తాయి.

♦ పేషెంట్లు త్వరగా కోలుకొనేందుకు పోషకాలతో కూడిన శాఖాహారం మాత్రమే ఇస్తారు.

♦ రోగులలో షుగర్, హైబీపీ, కిడ్నీ సమస్యలు వంటి జబ్బులతో బాధపడేవాళ్లు ఉంటే వారి కోసం ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.

♦ ఆసుపత్రిలో చేరే సమయంలోనే తమకు ఉన్న ఇతర సమస్యలను కూడా బాధితులు స్పష్టంగా నమోదు చేయాలి.

♦ ఈ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆరుగురు వైద్య నిపుణులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారు. అలాగే నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది ఉంటారు.

♦ ప్రత్యేక అంబులెన్స్‌ సదుపాయం.

♦ అత్యవసర పరిస్థితుల్లో  రోగులను పెద్ద ఆసుపత్రులకు తరలిస్తారు.

♦ ఈ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆక్సిజన్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది. వెంటిలెటర్‌ లు ఉండవు. రోగికి వెంటలెటర్‌ అవసరమైతే మాసాబ్‌ ట్యాంకులోని మహావీర్‌ ఆసుపత్రిలో తక్కువ చార్జీతో వెంటిలెటర్‌ సదుపాయంతో వైద్యాన్ని అందజేస్తారు.

 

హెల్ప్‌లైన్‌ నెంబర్లు

91211 55500

91212 55500

91213 55500.

You might also like

Leave A Reply

Your email address will not be published.