FbTelugu

చిన్నారులపై కోవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు 18 సంవత్సరాలకు పైబడిన వారికి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్నవారికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు.
అమెరికాలో ఇటీవలే 12 నుంచి 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతించారు. థర్డ్ వేవ్ లో చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు ముందస్తు హెచ్చరిక నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, పరిశోధనా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ చిన్నారులపై వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలు జరిపేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కు దరఖాస్తు చేసుకోగా అనుమతించింది. 2 సంవత్సరాల నుంచి 18ఏళ్ల లోపు వారిపై రెండు, మూడు దశల ప్రయోగాలు నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. మూడో దశ ప్రయోగాలకు ముందు రెండో దశ క్లినికల్ టెస్టుల భద్రతా వివరాలు, డిఎస్ఎంబి సిఫారసులను కేంద్ర ఔషద ప్రమాణ స్థాయి సంస్థకు సమర్పించాలని షరతు విధించారు. ఢిల్లీ ఎయిమ్స్, పాట్నా ఎయమ్స్, నాగపూర్ మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా దేశంలోని పలు చోట్ల క్లినికల్ ప్రయోగాలు జరగనున్నాయి. 28 రోజుల వ్యవధిలో చిన్నారులైన వలంటీర్లకు రెండు డోసులు ఇవ్వనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.