FbTelugu

కోవాగ్జిన్ ధర తగ్గింపు

హైదరాబాద్: సిరం కంపెనీ బాటలో భారత్ బయోటెక్ నిర్ణయం తీసుకున్నది. తాము ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరను తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో ఒక్క డోసు రూ.600 కు సరఫరా చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.600 బదులు రూ.400 లకే రాష్ట్రాలకు విక్రయిస్తామని భారత్ బయోటెక్ ఇవాళ అధికారికంగా వెల్లడించింది. ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1200 కు ఒక డోసు విక్రయిస్తామని తెలిపింది. రెండు సంస్థలు గతంలో ప్రకటించిన ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.