FbTelugu

దంపతులిద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య

ప్రకాశం: ఇద్దరు దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన జిల్లాలోని కొండెపి మండలం కట్టావారి పాలెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టావారి పాలెంటో నివాసం ఉంటున్న ప్రసన్న సతీష్ భార్యాభర్తలు.

కాగా వీరిరువురు ఇవాళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వారు అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like