FbTelugu

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ప్రకాశం: ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలోని ఉలవపాడు మండలం, కరేడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కరేడులో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకునేందుకు నిశ్చయించుకొని పురుగుల మందు తాగారు.

అనంతరం సదరు యువతి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా తెలిపింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా ప్రేమ జంటను గుర్తించి వారిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.