FbTelugu

లెక్కలేనంత అవినీతి కేసీఆర్ ది: అరవింద్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కుటుంబం లెక్కలేనంత అవినీతి చేసిందని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. అతి త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో అరవింద్ అధికార టీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.

బీజేపీ దేశంలో 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఎక్కడైనా మతకల్లోలాలు జరిగాయా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని కరెంటు స్తంభాలకు ఎల్‌ఈడీ లైట్లు చుట్టారని, వాటిలో ఒక్కో స్తంభానికి రూ.26 వేలు కాంట్రాక్టర్లకు ఇచ్చారని విమర్శించారు. తమ పార్టీ మత ఘర్షణలను ప్రోత్సహిస్తోందంటూ వారు చేస్తోన్న వ్యాఖ్యలు సరికాదని అన్నారు. బీజేపీ అధికారంలో లేని చోట మత కల్లోలాలు ఎందుకు జరుగుతున్నాయని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.