FbTelugu

మౌలాలిలో కౌంటింగ్ ఆపేశారు…

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ లో అక్రమాలు బయటపడుతున్నాయి. మౌలాలి డివిజన్ లో బ్యాలెట్ బాక్స్ ఓట్లకు, నమోదు అయిన ఓట్లకు వ్యత్యాసం రావడంతో కౌంటింగ్ నిలిపివేశారు.

ఒక బ్యాలెట్ బాక్స్ లో అధికంగా 33 ఓట్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 361 ఓట్లు నమోదు కాగా బ్యాలెట్ బాక్స్ లో 394 ఓట్లు ఉన్నాయి. రెండింటి మధ్య వ్యత్యాసం ఉండడంతో బీజేపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా ఒక్క డివిజన్ లోనే కాదు నాలుగైదు డివిజన్లలో ఇదే విధంగా రావడంతో అక్కడ బీజేపీ పోలింగ్ ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.