FbTelugu

కరోనా పేషెంట్లు కానే కాదు… మరి ఎవరు?

కొలకతా: ఈ ఫొటోను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోయి కంగుతింటారు. కరోనా పేషెంట్లు ఏంటి ఇలా బయట ఉన్నారని ఆశ్చర్యపోతారు. కాని వారు హెల్త్ స్టాఫ్ అనుకుంటారు. కానే కాదు మరి.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇవాళ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దినాజ్ పూర్ జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల సిబ్బంది రక్షణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్కరికి కూడా కరోనా సోకకుండా చర్యలు తీసుకోవడం విశేషం. రాయిగంజ్ పాలిటెక్నిక్ కాలేజీ లో కౌంటింగ్ సిబ్బంది పిపిఈ కిట్లు ధరించారు. వీరి డ్రెస్ ను చూసిన పోలింగ్ ఏజెంట్లు షాక్ కు గురయ్యారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చామా, కరోనా కేర్ సెంటరా అనుకుని కొంత అనుమానానికి గురయ్యారు. ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.