FbTelugu

మున్సిపల్ ఓట్ల లెక్కింపు షురూ

హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకరల్ మున్సిపల్ ఓట్లను లెక్కిస్తున్నారు.

దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లింగోజిగూడ, మరో నాలుగు మున్సిపాల్టీ వార్డులకు కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు సిబ్బందిని కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతించారు. మే 1, 2 తేదీల్లో పరీక్షలు చేయించుకుని, నెగెటివ్ చూపించిన వారికే డ్యూటీలు కేటాయించారు. ఈవిఎం లు కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించడం మూలంగా ఫలితాలు సాయంత్రం వరకు బయటకు వచ్చే అవకాశాలు లేవు. తొలుత పార్టీల వారీగా పోలయిన బ్యాలెట్లను కట్టలు కట్టి, ఆ తరువాతే లెక్కింపు మొదలు పెడతారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.