FbTelugu

అక్రమ మైనింగ్ పై కౌంటర్లు వేయాలి: ఏపీ హైకోర్టు

అమరావతి: సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ కేసులో పిటీషన్ దారుడు పేర్కొన్న ప్రతివాదులందరి తరఫున కౌంటర్లు దాఖలు చేయాలని మైనింగ్ శాఖను హైకోర్టు ఆదేశించింది.

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై వచ్చిన అక్రమ మైనింగ్ ఆరోపణలపై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమ మైనింగ్ జరగలేదని మైనింగ్ శాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ పరిశీలించిన తరువాత, పిటిషనర్ దారుడు పేర్కొన్న ప్రతివాదులందరి తరపున కౌంటర్లు దాఖలు చేయాలని మైనింగ్ శాఖను ధర్మాసనం ఆదేశించింది. ప్రైవేట్ ప్రతివాదులు కూడా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా ఈ కౌంటర్లపై రిజైండర్ కూడా వెంటనే దాఖలు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది నాగ రఘును న్యాయస్థానం ఆదేశించింది. మైనింగ్ కేసు తదుపరి విచారణ హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.