FbTelugu

కిలో మట్టి కోసం బిలియన్ డాలర్ల ఖర్చు

వాషింగ్టన్: ఒక కిలో మట్టి విలువ ఎంత ఉంటుంది. మహా అయితే లక్షల్లో ఉంటుంది. కాని అంగారక గ్రహం మీద ఉన్న మట్టిని భూమ్మీదకు తెచ్చేందుకు అమెరికా 9 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నది.
ఈ విషయాన్ని అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) అధికారికంగా ప్రకటించింది. అంగారక గ్రహం మీద దిగిన నాసా పర్సివరెన్స్ రోవర్ ఇదివరకే పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో అత్యంత విలువైన అపురూపమైనది భావిస్తున్న అక్కడి మట్టిని భూమి మీదకు తెప్పించే ప్రయత్నాలకు నాసా శ్రీకారం చుట్టింది.

ఈ బృహత్తర, చారిత్రక ప్రాజెక్టు కోసం నాసా లక్షల కోట్లు వెచ్చిస్తున్నది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ మట్టి భూమ్మీద అపురూపమైన వస్తువుల్లో అగ్రస్థానంలో నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రాజెక్టు కాల పరిమితి రెండేళ్లు కాగా, మూడు దశల్లో అమలు చేయనున్నారు. మట్టి నమూనాల సేకరణకు కనీసం రెండేళ్ల సమయం పట్టనుంది. ఒక కిలో మట్టి తేవడానికి కనీసం దశాబ్ధకాలం పట్టవచ్చని అంటున్నారు. లక్షల కోట్లు ఖర్చు చేసి కిలో మట్టి తెస్తారా అంటూ అమెరికన్లు నాసా తీరుపై విమర్శలు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.