FbTelugu

సైకిల్ పైనే శవాన్ని తరలించారు

బెంగళూరు: మానవత్వం అనేది మచ్చుకైనా లేకుండా పోతున్నది. కరోనా సోకి చనిపోతే వైరస్ ఆరు గంటలకు మించి ఉండదని ప్రభుత్వాలు నెత్తినోరు కొట్టుకుంటున్నా ఎవరూ నమ్మడం లేదు. ఇంకా దూరం దూరం జరుగుతున్నారు.

సైకిల్ పై శవాన్ని తీసుకువెళ్లే హృదయ విదారక ఘటన బెలగావి జిల్లా కిత్తూరు తాలుకా ఎం.కె.హుబ్బలిలో చోటు చేసుకున్నది. హుబ్బలికి చెందిన ఒక వ్యక్తి కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. ఆయన కరోనా సోకి చనిపోయాడని పలువురు అంత్యక్రియలకు దూరంగా ఉండిపోయారు. స్థానికుల సహకారం లేకపోవడంతో కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు. సైకిల్ పైనే మృతదేహాన్ని స్మశాన వాటిక వరకు చేర్చారు. పీపీఈ కిట్లు ధరించి ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

ఈ వీడియో ను కర్నాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డికె.శివకుమార్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.

You might also like