FbTelugu

కరోనా మహమ్మారి ముదురుతోంది: కేంద్రం ఆందోళన

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతంగా పెరుగుతున్నదని, పరిస్థితి రానురాను మరింత దయీనీయంగా తయారవుతోందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. బెంగళూరు, నాందేడ్, పూణే, ఔరంగాబాద్, నాసిక్, అహ్మద్ నగర్, థానే, నాగపూర్, ముంబై నగరాల్లో కేసులు విపరీతంగా నమోదుతున్నాయని తెలిపింది.

ఇవాళ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెక్రెటరీ రాజేష్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ, వైరస్ ను నియంత్రించేందుకు కేసుల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలను కోరినట్లు ఆయన తెలిపారు. కొన్ని రాష్ట్రాలు బాగానే చేస్తున్నప్పటికీ మెజారిటీ రాష్ట్రాలు తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఎందుకు పెంచడం లేదని ప్రశ్నిస్తే, పెంచుతున్నామని చెప్పి సర్దిచెబుతున్నారన్నారు. ర్యాపిడ్ టెస్టుల కన్నా ఆర్టిపిసిఆర్ పరిక్షలే ఎక్కువగా చేయాలని ఆదేశించామన్నారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించాలని కోరినట్లు రాజేష్ భూషణ్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.