FbTelugu

సడలింపులతో పుంజుకున్న కరోనా వ్యాప్తి

భారత్ లో లాక్ డౌన్ కు సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. ప్రపంచ కరోనా కేసుల సంఖ్యలో భారత ర్యాంకు రోజురోకి పైపైకి ఎగబాకుతోంది. ప్రస్తుతం భారత్ ప్రపంచ కరోనా కేసుల్లో నాల్గవ ర్యాంకులో ఉంది.

నేటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,626 కు చేరింది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,50,101 గా ఉంది. కాగా ఈ వైరస్ నుంచి కోలుకొని ఇప్పటివరకు 1,62,326 మంది ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 9,199 మంది మృత్యువాత పడ్డారు.

You might also like