FbTelugu

భర్తను బలిగొన్న కరోనా.. భార్య సూసైడ్

హైదరాబాద్: కరోనాతో భర్త మృతి చెందడంతో.. మనస్తాపంతో భార్యకూడా ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన నగరంలోని సైనిక్‌పురిలోని అంబేద్కర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధనలక్ష్మి(55), వెంకటేశ్‌(60) భార్యాభర్తలు.

వీరు కొన్నేండ్ల క్రితం నల్లగొండ జిల్లా నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చారు. సైనిక్‌పురిలోని అంబేద్కర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ధనలక్ష్మి భర్త వెంకటేశ్‌ ఇటీవల కరోనా బారిన పడి మృతి చెందాడు. భర్త మృతితో తీవ్ర మనస్తాపం చెందిన ధనలక్ష్మి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వీరికి పిల్లలు కూడా లేకపోవడంతో ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.