న్యూఢిల్లీ: భారత్ లో లాక్ డౌన్ కు సడలింపులను కేంద్రం ప్రకటించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. నేటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఏకంగా 1,50,793 కు చేరింది.
గడిచిన 24 గంటల్లోనే దేశంలో 5,843 కరోనా కేసులు నమోదైనాయి. అదే సమయంలో 172 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,337 కు చేరింది. నేటి వరకు కరోనా బారినుంచి బయటపడిన వారి సంఖ్య 64,426 కు చేరింది. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 83,004 కు చేరింది.