FbTelugu

ప్రేయసి కోసం వెళ్లి కరోనా అంటించుకున్నాడు

చెన్నై: ప్రేయసి కోసం వెళ్లి ఓ యువకుడు కరోనా వైరస్ ను అంటించుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. తిరుపత్తూరుకు చెందిన ఓ యువకుడు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

లాక్ డౌన్ కారణంగా వారిద్దరు కలవడం కష్టమైంది. ఎలాగైనా ప్రేయసిని కలవాలని నిర్ణయించుకున్న ఆ యువకుడు ఎట్టకేలకు ఓ కూరగాయల లారీలో తన ప్రేయసి దగ్గరకు వెళ్లొచ్చాడు. ఆ లారీలో ప్రయాణించిన వారికి పరీక్షలు చేయగా 20 మందికి కరోనా పాజిటీవ్ వచ్చినట్టుగా తెలిసింది. అందులో ఈ యువకుడు కూడా ఉన్నాడని అధికారులు తెలిపారు.

You might also like