FbTelugu

మార్నింగ్ షో తో ‘‘కరోనా వైరస్’’: వర్మ

రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న కరోనా వైరస్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 15 నుంచి తెరిచే సినిమా థియేటర్లలో మార్నింగ్ షో తో తన సినిమా మొదలవుతుందని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.

వర్మ నిర్మాణ సారధ్యంలో వస్తున్న కరోనా వైరస్ సినామాకు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తుండగా, డీఎస్సార్ సంగీతం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మువీ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసి… అక్టోబర్ 15న థియేటర్లు ప్రారంభం అవుతున్నాయి, తనకు అనుఈ ప్రకటన ఆనందం కలిగిస్తుందన్నారు. లాక్ డౌన్ తరువాత థియేటర్లలో మొదలయ్యే సినిమాల్లో తన కరోనా వైరస్ మువీనే తొలిసినిమా అంటూ కామెంట్ పెట్టారు.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా దీన్ని విడుదల చేయాలని ముందుగానే అనుకున్నప్పటికీ లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో థియేటర్లలోనే ప్రదర్శించనున్నారు. తన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆర్జీవీ వరల్డ్ యాప్ ద్వారా పలు సినిమాలను విడుదల చేసిన విషయ తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.