FbTelugu

దేశంలో కరోనా వైరస్ పరుగులు

న్యూఢిల్లీ: గడచిన మూడు నెలలతో పోల్చితే దేశంలో కరోనా కేసుల ఉధృతి అమాంతం పెరిగింది. వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం, కేసులు కూడా అంతగా నమోదు కాకపోవడంతో అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి.

గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో 43,846 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 3,09,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,46,03,841 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తమిళనాడులో విద్యాలయాలను మూసివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. మహారాష్ట్రలో కొన్ని జిల్లాలలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణీకులను పరీక్షించిన తరువాతే విమానాశ్రయాల నుంచి ఇళ్లకు పంపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పనిసరి చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.