FbTelugu

విజయనగరానికి తాకని కరోనా

అమరావతి: ఏపీ లో తాజా గా 73 కొత్త పొజిటివ్ కేసులతో కరోనా బాధితుల సంఖ్య1332 కి చేరింది. ఈ రోజు నమోదైన 73 కేసులలో గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోనే 53 కేసులు ఉన్నాయి.

వైరస్ ఫ్రీ జిల్లా గా విజయనగరం కొనసాగుతోన్నది. ఏపీలో మొన్నటి వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వైరస్ రహిత ప్రాంతాలుగా ఉండగా మూడు కేసులు నమోదు కావడంతో వైరస్ జిల్లాల జాబితాలో శ్రీకాకుళం చేరిపోయింది.

వైజాగ్ లో తాజా గా మరో పొజిటివ్ కేసు నమోదు అయింది. మొత్తం 287 మంది కి వ్యాధి తగ్గుముఖం పట్టగా మరణించిన వారి సంఖ్య 31. ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారు 1014 మంది ఉన్నారు.

You might also like