FbTelugu

జోరుమీదున్న వైరస్‌

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య చాలా వేగంగా పెరిగి పోతున్నాయి. పెరుగుతున్న పాజిటివ్‌ల సంఖ్యను చేస్తుంటే దేశంలోని జనాలకు నిద్ర పట్టడం లేదు. పైగా కరోనా లక్షణాలంటూ రోజుకో లక్షణం కొత్తగా బయటకు వస్తుండడంతో అసలు కరోనాకు ఏ లక్షణాలున్నాయో తెలియక జనం తికమకపడుతున్నారు. వారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇది కరోనేనేమో అన్న భయాందోళనకు గురవుతున్నారు.

దీనికి తోడు లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత పాజిటివ్‌ల సంఖ్య రేసు గుర్రాల్లా పరిగెడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 57,117 పాజిటివ్‌ కేసులు, 764 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 16,95,988కి చేరుకున్నాయి. వీటిలో 5,65,103 యాక్టివ్‌ కేసులు, 10,94,374 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి నయమై డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 36,511 మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. ఇండియాలో కొత్తగా 36,569 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.

భారత్‌ లో ఇప్పటివరకు 1.93కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించగా.. గత 24గంటల్లో 5.25 లక్షల కరోనా టెస్టులు చేసినట్టు ఐసీఎంఆర్‌ ప్రకటించింది. అటు మహారాష్ట్రలో ఎక్కువగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 4,22,118మందికి కోవిడ్‌ సోకగా 14,994 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు 2,56,158 మంది కరోనా బాధితులు కోలుకోగా 1,50,966 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

You might also like