FbTelugu

మహారాష్ట్రలో చిన్నారులకు కరోనా వైరస్

ముంబయి: కరోనా వైరస్ చిన్నారులను వెంటాడుతోంది. గత ఏడాది వైరస్ కేవలం యువకులు, వృద్ధులకే సంక్రమించగా ఈ సారి మాత్రం వైరస్ చిన్నారులను కూడా వదలడం లేదు.

ప్రధానంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తుండగా, కొత్త కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్ర నుంచే నమోదు అవుతుండడం గమనార్హం. కేవలం మార్చి నెలలోనే 6 లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విడతలో అన్ని రకాల వయసు వారు కరోనా బారిన పడడం కలవర పెట్టే అంశం. మార్చి నెలలో నమోదు అయిన కేసులలో 30 నుంచి 4 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో 1.34 లక్షల(22శాతం) మందికి, 10 నంచి 15 ఏళ్ల మధ్య పిల్లల్లో 50 కేసులు వచ్చాయని ఆరోగ్య శాఖ తన బులెటిన్ లో వెల్లడించింది.

బహిరంగ ప్రదేశాల్లో చిన్నారులు ఎలాంటి మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా ఆటలాడడం, తిరగడం వల్ల వైరస్ అంటుకుంటున్నది. అదే విధంగా 11 నుంచి 20 ఏళ్ల మధ్య వారికి 40 వేల మందికి కరోనా సోకిందని ప్రభుత్వం వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.